ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యం…
–ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: గోదావరిఖని,స్థానిక 36వ.డివిజన్ పరిధిలోని గోదావరిఖని బస్టాండ్ ఆధునీకరణ పనులకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శంకుస్థాపన చేశారు. దాదాపు రూ.20 లక్షల వ్యయంతో చేపట్టనున్న బస్టాండ్ రెనోవేషన్ పనుల్లో భాగంగా సి.సి. రోడ్డు విస్తరణ, ప్లాట్‌ఫామ్ మరమ్మతులు, సానిటరీ పైప్‌లైన్‌ల ఏర్పాటు, బస్టాండ్ ఆవరణలో పెయింటింగ్ పనులు తదితర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా బస్టాండ్ అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన మౌలిక వసతులు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బస్టాండ్‌కు వచ్చే వేలాది మంది ప్రయాణికులకు ఈ పనులు పూర్తయిన తర్వాత మరింత సౌకర్యవంతమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.
అనంతరం బస్టాండ్ ఆవరణను పరిశీలించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ప్రయాణికులకు ఇబ్బందిగా బస్టాండ్ లోపల మరియు ఆవరణలో వాహనాలను పార్కింగ్ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బస్టాండ్ పరిసరాలు పరిశుభ్రంగా, క్రమబద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని డిపో మేనేజర్‌ను ఆదేశించారు. ప్రయాణికుల రాకపోకలకు ఆటంకం కలగకుండా చూడాలని, బస్టాండ్ చుట్టూ ఎలాంటి అవ్యవస్థకు తావులేకుండా నిర్వహణ చేపట్టాలని సూచిస్తూ డిపో మేనేజర్‌పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రామగుండం కార్పొరేషన్ మేయర్ మహంకాళి స్వామి, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొంతల రాజేష్, 36వ డివిజన్ కార్పొరేటర్ కల్వల పద్మావతి–రంజిత్, కార్పొరేటర్లు గడ్డం రమాదేవి–శ్రీనివాస్, నెలకంటి రాము, దూళికట్ట సతీష్, తాళ్లపల్లి యుగంధర్, చిరురాల నాగరాజు, చుక్కల లావణ్య–శ్రీనివాస్, కర్రావుల డేవిడ్ రాజు, డిపో మేనేజర్, ఆర్టీసీ సిబ్బంది, కాంట్రాక్టర్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
