తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనే పరమావధిగా పనిచేస్తాం

Sakshitha news

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనే పరమావధిగా పనిచేస్తాం

తెలంగాణ ఉద్యమకారులను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం

సాక్షిత వనపర్తి : జయశంకర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో శాసనసభ్యులు మేఘా రెడ్డి

ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచనలు, ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, తెలంగాణ అభివృద్ధి కోసం ఆయన కలలు కన్న స్వప్నాలను సాకారం చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి నిమిషం పనిచేస్తామని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వనపర్తి పట్టణం లోని మెడికల్ కళాశాల చౌరస్తాలో ఏర్పాటుచేసిన జయశంకర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన ఎందరో యువకుల కుటుంబాలను సైతం గుర్తుంచుకొని వారికి చేదోడు వాదోడుగా నిలబడుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వమని ఎమ్మెల్యే పేర్కొన్నారు

గత పాలకులు తెలంగాణ విప్లవగలం గద్దర్ ని ఎన్నో రకాలుగా అవమానపరిస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన కూతురు వెన్నెలమ్మకు సముచిత స్థానాన్ని కట్టబెట్టి గౌరవించుకుంటుందని తెలిపారు
తెలంగాణ రాష్ట్రం కోసం ఒంటిపై కిరోసిన్ పోసుకొని జై తెలంగాణ అంటూ నిమదించిన శ్రీకాంతాచారి తల్లి కి మహిళా కమిషన్ సభ్యురాలుగా స్థానం కల్పించి గౌరవించుకున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని పేర్కొన్నారు

తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర గీతాన్ని అందించిన అందెశ్రీ ని ఎన్నో అవమానాల పాలు చేశారని అలాంటి అందర్శ్రీ రాసిన గీతానికి నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర గీతంగా గుర్తించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు

తెలంగాణ తల్లి సోనియా గాంధీ సుష్మాస్వరాజ్ గారు మీరా కుమారి ఈ ముగ్గురమ్మల కృషితోన తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని పేర్కొన్నారు

ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని గత పాలకులు అప్పుల ఊబిగా మార్చేశారని ఆయన విమర్శించారు

ఇచ్చిన మాట కోసం తెలంగాణ తల్లిగా పేరుందిన సోనియా గాంధీ ప్రకటిస్తే గత ప్రభుత్వ పాలనలోని కొందరు దొంగలు తామే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని ప్రగల్బాలు పలుకుతున్నాడు విడ్డూరమని విమర్శించారు

సోనియా గాంధీ కాళ్లు మొక్కిన నాయకులు నేడు ఇచ్చిన హామీలను పక్కకు పెట్టి తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోకుండా పదేళ్లు అవమానపరచారని ఆయన గుర్తు చేశారు

వనపర్తి నియోజకవర్గ పరిధిలోని ఉద్యమకారుల సంక్షేమం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఉద్యమకారులకు కావలసిన అంశాలపై దృష్టి సారించి పరిష్కారం చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు

కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవీరమే పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కదిరే రాములు వనపర్తి మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు యువకులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు

Scroll to Top