అంబర్ పెట్ నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్న తో మరియు బాగ్ అంబర్పేట్ కార్పొరేటర్ పద్మ వెంకట రెడ్డి తో కలిసి తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కి అంబర్ పెట్ డివిజన్ నాలా సమస్యపై వినతి పత్రం అందజేసిన అంబర్ పెట్ కార్పొరేటర్ ఇ.విజయ కుమార్ గౌడ్
ఈ సందర్భంగా కార్పొరేటర్ అంబర్ పెట్ డివిజన్ లో నాలా సమస్య చాలా తీవ్రంగా ఉన్నదనీ, ఎగువన ఉన్న మోహిన్ చెరువు నుంచి ముసరం బాగ్ బ్రిడ్జి వద్ద ఉన్నటువంటి ఎస్టిపి వరకు 5 కిలోమీటర్ల పొడవున నాలా విస్తరించి ఉన్నది,అందులో సిపిఎల్ ప్రహరీ గోడకి ఆనుకొని ఉన్న 832 మీటర్ల పొడవు నాలా డీజీపీ వద్ద ఫైల్ పెండింగ్ లో ఉన్నది,గత బిఆర్ఎస్ ప్రభుత్వం నాలా ప్రక్షాళన కొరకు ఎమ్మెల్యే చొరవతో 28 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది,కావున మంత్రిగారు చొరవ తీసుకొని సిపిఎల్ ప్రహరి గోడకి ఆనుకొని ఉన్న 832 మీటర్ల నాలా పనులను వెంటనే చేపించగలరని మనవి చేసుకుంటున్నాను
మరియు పటేల్ నగర్ చౌరస్తా నుండి ఎస్టిపి వరకు కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించిన నాలా పూర్తిగా దెబ్బతిన్నది కావున మీరు చొరవ తీసుకొని నూతన నాలా పనులకు నిధులను మంజూరు చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను
అలాగే పటేల్ నగర్ చౌరస్తాలో నూతన జంక్షన్ ఏర్పాటు కొరకు నిధులను విడుదల చేయవలసిందిగా మంత్రిగారి దృష్టికి తీసుకువచ్చారు
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి జాఫర్,అధికార ప్రతినిధి మహేష్ ముదిరాజ్,షేక్ రఫిక్, అజార్,పాషా బాయ్,రాజ్ కుమార్,రాజేష్,సంతోష్ చారి తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
