మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు..
సాక్షిత : జాతీయ జెండాను, బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ..
మేడ్చల్ జిల్లా గండిమైసమ్మలోని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు జాతీయ జెండాను మరియు బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి, అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ప్రజలందరికీ అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. వారు మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ 14 ఏళ్ల ఉద్యమం, పదేళ్ల ప్రగతి పాలనతో తెలంగాణను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ సార్ అని తెలిపారు. ఈ నేల ఆత్మగౌరవం, ఆస్తిత్వ రక్షణ కోసం తెలంగాణ సైనికులుగా నిరంతరం పోరాడుదామని, తెలంగాణ వ్యతిరేక కుట్రలను చేదిద్దామని, మన తెలంగాణను కాపాడుకుందామని సభ్యులు అందరూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, మహిళా నాయకులు, విద్యార్థి విభాగం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
