తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ..
సాక్షిత : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని 283వ డివిజన్ గురుమూర్తి నగర్ తో పాటు హెచ్ఎంటి (HMT ) కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించిన అప్పటి యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. రాష్ట్ర సాధన వెనుక ఎన్నో ఏళ్ల ప్రజా ఉద్యమాలు, త్యాగాలు, పోరాటాల చరిత్ర ఉందని పేర్కొన్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను, త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు.
అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అందరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో హెచ్ఎంటి జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్ రెడ్డి మరియు కేశవ్, శ్రీశైలం, శ్రీనివాస్ నాయక్ మరియు స్థానిక 281 మరియు 283 డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
