ఏదులలో పురుగుమందుల, విత్తనాల దుకాణాలపై టాస్క్ ఫోర్స్ ఆకస్మిక తనిఖీ
సాక్షిత వనపర్తి :
ఏదుల మండల కేంద్రంలోని పురుగుమందుల విత్తనాల దుకాణాల పై మండల స్థాయి టాస్క్ ఫోర్స్ టీం వ్యవసాయ రెవెన్యూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించడం జరిగింది. మండల కేంద్రంలోని చెన్నారం రెడ్డి ట్రేడర్స్టిరెడ్డి ఫర్టిలైజర్స్ ఆగ్రోస్ రైతుసేవా కేంద్రం మరియు రెడ్డి పార్టీలైజర్స్ దుకాణాల్లో తనిఖీలు చేయడం జరిగింది నకిలీ విత్తనాలు గురించి స్టాక్ రిజిస్టర్ బిల్ బుక్స్ సమయం మించిపోయిన విత్తనాలు పురుగు మందులను ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదని షాప్ యజమానులను హెచ్చరించడం జరిగింది విత్తన చట్టం నిబంధనలు పాటించని షాప్ యజమానులకు విత్తన చట్టం ప్రకారం కఠిన శిక్షలు ఉంటాయని షాప్ సీట్ చేస్తావని తీవ్రతలు వచ్చింది అదేవిధంగా గ్రామసభలలో ఫార్మర్ రిజిస్టర్ గురించి పంట వ్యర్థాలను కాల్చివేయడం పంట మార్పిడి గురించి తెలియజేయడం జరిగింది పంట వ్యర్థాలను కాల్చినట్లయితే 5000 నుంచి 25 వేల వరకు జరిమానా విధించడం జరుగుతుందని టీం హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రమేష్ భాష మొని, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డి శశిధర్ తాసిల్దార్ తస్కిన్ ముబీనా మరియు వ్యవసాయ విస్తరణ అధికారులు అర్చన శ్రీవిద్య పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
