స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తి…………….
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లేల చిన్నారెడ్డి
సాక్షిత వనపర్తి :
వనపర్తి పట్టణం వివేకానంద చౌరస్తా నందు గల వివేకానంద విగ్రహానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన
మాట్లాడుతూ
స్వామి వివేకానంద 1863 జనవరి 12న జన్మించారని ఆయన జయంతిని భారత ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించిందని అన్నారు. స్వామి వివేకానంద గొప్ప భారతీయ వేదాంతవేత్త, యోగా గురువు అని తెలిపారు. వివేకానంద రామకృష్ణ పరమహంస శిష్యులు అని. ఆయన రామకృష్ణ మిషన్‌ను స్థాపించి, హిందూ మతం మరియు వేదాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు అని అన్నారు.1893లో అమెరికాలోని చికాగోలో జరిగిన ప్రపంచ మతాల సమావేశంలో “సోదర సోదరీమణులారా” అని ప్రసంగించి, హిందూ మతాన్ని గొప్పగా పరిచయం చేశారు అని అన్నారు. వివేకానంద నా ఆశలన్నీ నవతరం పైనే మనకు కావాల్సింది ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగి వారుఅని యువతను మీ కాళ్ళపై మీరు నిలబడండి అంటూ యువతను వివేకానంద జాగృతం చేశారు అని తెలిపారు. ఆత్మవిశ్వాసం ఉంటే ఎంతటి కార్యానైనా సాధించవచ్చని పిరికితనం మనిషిని నిర్వీర్యం చేస్తే ఆత్మవిశ్వాసం విజయ తీరాల వైపు నడిపిస్తుందని యువతను చైతన్యపరిచారు. నేటి కాలంలో అంతర్జాలం, ఓటీటీలు, సినిమా ప్రేరణతో యువత గాడి తప్పుతుందని మాదక ద్రవ్యాల మత్తులో చిత్తవుతుంది కాబట్టి యువత మేలుకొని మాదకద్రవ్యాలను అరికట్టి భారత దేశ అభివృద్ధికి మీ వంతు సహకారం చూపాలని యువతను కోరారు. నైతిక విలువలను పెంచి మనోబలాన్ని బుద్ధిని వికసింపజేసి స్వ శక్తి పై నమ్మకం పెంచే విద్య దేశానికి అత్యవశ్యకం అని అన్నారు. వివేకానంద యువత క్రీడల్లో ముందుండాలని ఆకాంక్షించారని తెలిపారు. స్వామి వివేకానంద బోధనలు వేలాది మంది ని ప్రభావితం చేశాయని ముఖ్యంగా యువతను ఉత్తేజ పరిచాయి అని తెలిపారు.
కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి జిల్లా ఏఐపిసి అధ్యక్షులు నాగార్జున, వనపర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ బాబా, శంకర్ గౌడ్ , వనపర్తి అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాగి అక్షయ్ ,యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ఇర్ఫాన్ , మాజీ కౌన్సిలర్ బ్రహ్మం ,పెద్దమందడి NSUI నాయకులు వెంకటేష్ సాగర్ ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోళ్ల వెంకటేష్,అబ్దుల్లా, నందిమల్ల రాము,జానంపేట నాగరాజ్, నందిమల్ల సందీప్ ,రాంబాబు, ఎంట్ల రవి , విజయ్, చీర్ల రాజేష్,బాల్రాజ్ , సిరివాటి సురేష్ ,చెన్నయ్య,పెద్దమందడి సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
