గ్రేటర్ తిరుపతి” ఏర్పాటుకు తోడ్పాటు అందించాలి
** సమీక్షా సమావేశంలో మంత్రి, జిల్లా కలెక్టర్
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు తోడ్పాటు అందించాలని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్ శాఖా మంత్రి అండ్ జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ కోరారు.
ఉదయం స్థానిక కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై నిర్వహించే జిల్లా సమీక్ష సమావేశ కార్యక్రమం జిల్లా ఇంచార్జ్ మంత్రి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి మంత్రి మాట్లాడుతూ .. రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుపతి జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నా రన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుతం 30.174 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉందని, దీన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు అదనంగా 270.23 చదరపు కిలోమీటర్ల కు విస్తరించాల్సి ఉందన్నారు. ఇందుకోసం జిల్లాలోని ప్రజాప్రతినిధులు తమ సంపూర్ణ తోడ్పాటును అందించాల్సి ఉందన్నారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కానీ శెట్టిపల్లి సమస్యకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించామని, ఈనెల 22వ తేదీలోగా అన్ని పనులను పూర్తి చేసి పట్టాలను కూడా లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. సమీక్షా సమావేశం అనంతరం పాత్రికేయుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లా సమీక్షా కమిటీ మీటింగ్ ఇంచార్జ్ మంత్రి అనగాని సత్య ప్రసాద్ అధ్యక్షతన జరిగిందన్నారు. ఈ సమావేశంలో అన్ని నియోజకవర్గ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా అధికారుల సమక్షంలో అన్ని రకాల సమస్యలపై సమీక్షించడం జరిగిందన్నారు.
సుమారు నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమీక్షలో ప్రతి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. అదేవిధంగా అధికారులకు కూడా ప్రతి సమస్యను తగిన సమయంలో ఏ విధంగా పరిష్కారం చేయాలి, చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అన్నారు. మంత్రి సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలో అధికారులకు సూచించామన్నారు. సమావేశంలో దాదాపుగా 36 శాఖలపై అధ్యయనం చేయడం జరిగిందన్నారు. మునుపటి రివ్యూలో ఏమైనా పరిష్కారం కానీ సమస్యలు ఇంకా ఉంటే ఎలా చేస్తే బాగుంటుంది చర్చించుకొని ఒక కార్యచరణ రూపొందించుకొని వాటిని పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపతిని గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని ముఖ్యమంత్రి ఎప్పటినుంచో అంటున్నారని మున్సిపల్ కౌన్సిల్ లో కూడా అప్రూవల్ రావడం జరిగిందన్నారు. రాబోయే తరాలకు మంచి చేయాలని సీఎం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారని అన్నారు. తిరుపతి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఒక మంచి పరిణామంగా భావించాలన్నారు. అలాగే ఇటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యాల్లో మొంథా తుఫాను, రాయల చెరువు సంఘటనలలో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అందరూ ఎక్కడ కూడా నష్టం లేకుండా ముఖ్యమంత్రి ఆశించినట్టుగా క్షేత్రస్థాయిలో అమలు చేసి ప్రాణనష్టం లేకుండా చూడడం అభినందనీయమన్నారు.
మరీ ముఖ్యంగా రాయల చెరువు కు గండిపడటంతో 9 అడుగుల నీళ్లు రావడం నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం అని ఇలాంటి సందర్భాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్సై కావచ్చు అతని కింద ఉన్నటువంటి కానిస్టేబుల్స్ ఇంకా పిఎస్ఐ అందరూ కూడా స్పాంటేనియస్ గా స్పందించి సైరన్లు వేసి అందరిని కూడా సురక్షితంగా తరలించినందుకు వాళ్ళందరినీ కూడా అభినందించాలన్నారు. అలాగే రెవెన్యూ సిబ్బంది కూడా సకాలంలో అక్కడికి వెళ్లి ఎలాగైతే మంతా తుఫానులో అందరిని ఆదుకున్నారో రాయల చెరువు సంఘటనలో కూడా భాగమై అక్కడున్న వారిని రక్షించడం అభినందించదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్.ఎల్. సిలు బల్లి కల్యాణ చక్రవర్తి, సిపాయి సుబ్రహ్మణ్యం, చంద్రగిరి, సూళ్లూరుపేట, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, వెంకటగిరి, గూడూరు ఎమ్మెల్యేలు పులిపర్తి నాని, జంగాలపల్లి శ్రీనివాసులు, బొజ్జల సుధీర్ రెడ్డి, నెలవల విజయశ్రీ, కోనేటి ఆదిమూలం, రామకృష్ణ, పాశం సునీల్ కుమార్, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, క్లీన్ అండ్ గ్రీన్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహా యాదవ్, డి సి సి చైర్మన్ అమాస రాజశేఖరరెడ్డి, వన్నియకుల క్షత్రియ కోఆపటివ్ చైర్మన్ సీఆర్ రాజన్, డిసిఎమ్సి చైర్మన్ నాగేశ్వరావు, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహరి రావు, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివ బెస్త కార్పొరేషన్ చైర్మన్ శ్రీధర్ బొమ్మన, ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఇంచార్జి జాయింట్ కలెక్టర్,
మునిసిపల్ కమీషనర్ ఎన్ మౌర్య, ట్రైని కలెక్టర్ సందీప్ రఘు వాన్సీ, జిల్లా అటవీ శాఖ అధికారి సాయి బాబా, జిల్లా రెవెన్యూ అధికారి జి నర్సింహులు, తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట,ఆర్టీవోలు రామ్మోహన్, బానుప్రకాష్ రెడ్డి, కిరణ్మయి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజమాండ్, సాంఘిక సంక్షేమ శాఖ డిడి విక్రమ్ కుమార్ రెడ్డి, డీపీ ఓ సుశీలా దేవి, డ్వామా పిడి శ్రీనివాసరావు, సి పి ఓ వెంకటేష్, డి ఎమ్ అండ్ హెచ్ ఓ బాలకృష్ణ నాయక్, డి ఈ ఓ, కుమార్, ప్రసాద్ రావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్లు విజయ్ భరత్ రెడ్డి, ఎల్. శివకుమార్, ఎక్సైజ్ నాగమల్లేశ్వర రావు, ల్యాండ్ అండ్ సర్వే శాఖ అధికారి, అరుణ్ కుమార్, ఆర్ టి ఓ మురళి మోహన్, ఆర్ అండ్ బి ఎస్ ఇ రాజా నాయక్ విద్యుత్ శాఖ, సివిల్ సప్లై, డి ఎల్ డి ఓ, సంక్షేమ శాఖ అధికారులు, మునిసిపల్ అధికారులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారి, గృహనిర్మాణ శాఖ, పశు సంవర్ధక శాఖ, రవాణా శాఖ, అగ్నిమాపక శాఖ అధికారి, వ్యవసాయశాఖ అధికారి, టూరిజం, జిల్లా అధికారులు. తదితరులు పాల్గొన్నారు.
