సత్యవేడు అభివృద్ధికి “తుడ” తోడ్పాటు
** అభివృద్ధి పనుల్లో పాల్గొన్న “తుడ” చైర్మన్ డాలర్స్
సాక్షిత ప్రతినిధి – సత్యవేడు / తిరుపతి: సత్యవేడు నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో “తుడ” కూడా తోడ్పాటు అందిస్తుందని “తుడ” చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు. సత్యవేడు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలంతో కలసి పలు అభివృద్ధి పనులను తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పరిశీలించారు. వాటిలో
పిచ్చాటూరు మండల కేంద్రంలోని సమస్యలకు పరిష్కారం చూపాలని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు కోరారు. అలాగే పిచ్చాటూరు మండలం అరణియర్ రిజర్వాయర్ దగ్గర నూతనంగా నిర్మిస్తున్న లైట్ హౌస్ భవనాన్ని పరిశీలించిన తుడా చైర్మన్
తగిన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ “తుడా పరిధిలోని తొమ్మిది నియోజకవర్గాలను సమానంగా అభివృద్ధి చేయడమే తన ముఖ్య ఉద్దేశ్యం అని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ను టూరిజం హబ్ గా తయారు చేయడానికి, అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ అహర్నిశలు కష్టపడుతున్నారని తెలిపారు. తుడా పరిధిలో పలు చెరువుల అభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నామని, వాటికి సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన, రహదారి నిర్మాణాలు, పార్కుల నిర్మాణం చేస్తామని తెలిపారు. తుడా పరిధిలో టూరిజం అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తున్నట్లు, తొమ్మిది నియోజకవర్గాలలో తుడా ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అంతకముందు పిచ్చాటూరు మండల కేంద్రానికి చేరుకున్న తుడా చైర్మన్ కు ఎమ్మెల్యే ఆదిమూలం, స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు గజమాలలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తుడా అధికారులు, సత్యవేడు నియోజకవర్గ మండల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
