డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు….
ఒకరికి 3 రోజుల జైలు, ముగ్గురిపై కేసులు నమోదు…

….
సాక్షిత పెద్దపల్లి//గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి. రాజేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు.
వారిని గోదావరిఖని సెకండ్ అడిషనల్ మేజిస్ట్రేట్ వెంకటేష్ దుర్వ గారి ఎదుట హాజరుపరచగా, ఇద్దరికి రూ.4,000 చొప్పున జరిమానా విధించారు. మరో వ్యక్తి రెండోసారి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడినందున న్యాయమూర్తి ఆయనకు 3 రోజుల జైలు శిక్ష విధించారు. అనంతరం అతడిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ బి. రాజేశ్వరరావు మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టవిరుద్ధమని, అలా నడిపిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన పత్రాలు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సూచించారు.
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, రాంగ్ రూట్‌లో ప్రయాణించకుండా ట్రాఫిక్ నియమాలను పాటించాలని, అతివేగాన్ని నివారించాలని ప్రజలకు సూచించారు
SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY