కాంచీపురం వస్త్రషోరూం ప్రారంభం
** ముఖ్య అతిథిగా “తుడ” చైర్మన్ హాజరు
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: స్థానిక ఎయిర్ బైపాస్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కాంచీపురం వరమహాలక్ష్మి బట్టల షోరూం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా “తుడ” చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా షోరూం అధినేత ప్రసాద్, మేనేజర్ రాజశేఖర్ రెడ్డిలు తుడ చైర్మన్ దివాకర్ రెడ్డిని ఘనంగా ఆహ్వానించి సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ప్రధాన శిష్యులు శ్రీ రామానుజ జీయర్ స్వామి కూడా డాలర్స్ దివాకర్ రెడ్డిని ఆశీర్వదించి శాలువతో సత్కరించారు. శ్రీవారి పాదాల చెంత 70వ షోరూమ్ ను ప్రారంభించిన పరమహాలక్ష్మి అధినేతలకు డాలర్స్ దివాకర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మన్నికైన వస్త్రాలు సరసమైన ధరలకు అందించి తిరుపతి ప్రజల అభిమానాన్ని చూరగొనాలని కోరారు.
