శంకర్‌పల్లిలో కన్నుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణం

Sakshitha news

శంకర్‌పల్లిలో కన్నుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణం

స్వామి వారి కళ్యాణంలో పాల్గొన్న పదివేల మంది భక్తులు

జై భవాని యూత్ (దసరా ఉత్సవ కమిటి), శ్రీరామ సేన వారి ఆద్వర్యంలో అన్నదాన కార్యక్రమం

శంకర్‌పల్లి: (సాక్షిత): శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని రైల్వే స్టేషన్ సమీపాన గల రామాలయంలో శ్రీరామ నవమి సందర్భంగా శుక్రవారం సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఉదయం 11:34 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రధాన అర్చకులు రాజేశ్వర్ జోషి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా శ్రీరాముడు తరపున కె. కిషోర్ కుమార్ పావని దంపతులు, శ్రీ సీతమ్మ వారి తరపున ఎంసాని పవన్ కుమార్ మమత దంపతులు పాల్గొన్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులు సుమారు పదివేల మంది పాల్గొని శ్రీ సీతారాముల కృపకు పాత్రులు అయ్యారు. కళ్యాణానికి వచ్చిన భక్తులకు జై భవాని యూత్ (దసరా ఉత్సవ కమిటి), శ్రీరామ సేన వారి ఆద్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఏ అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిఐ మీర్ ముదసర్ అలీ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కళ్యాణానికి మున్సిపల్ చైర్మన్ ప్రవీణ్ కుమార్, కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Scroll to Top