పేటలో వైభవంగా ‘శ్రీ శంకర నేత్రాలయం’ ప్రారంభం
ముఖ్య అతిథిగా మండలనేని చరణ్ తేజ
సాక్షిత చిలకలూరిపేట: పట్టణంలోని R.V.S.C.V.S స్కూల్ రోడ్డులో, విజయ బ్యాంక్ ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ శంకర నేత్రాలయం & ఆప్టికల్స్ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ యువ నాయకులు, ప్రదాత మండలనేని చరణ్ తేజ రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రిని అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలకు అత్యాధునిక కంటి వైద్య సేవలు అందుబాటులోకి రావడం సంతోషకరమని పేర్కొన్నారు.
కంటి చూపు సమస్యలతో బాధపడేవారు దూర ప్రాంతాలకు వెళ్లే పనిలేకుండా, స్థానికంగానే నాణ్యమైన చికిత్సను అందించేందుకు ఈ నేత్రాలయం కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. మెరుగైన సాంకేతికతతో, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ప్రజలకు అందుబాటులో ఉండటం అభినందనీయమని చరణ్ తేజ కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తూబాటి శ్రీహరి,పట్టణ టిడిపి అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, మొరకొండ మల్లిబాబు, మార్టూరు టౌన్ అధ్యక్షుడు
షేక్ వహీద్, టీం చరణ్ తేజ సభ్యులు, పలువురు కూటమి నాయకులు, హాస్పటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY