శ్రీ రామ లింగేశ్వర స్వామి ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమం

Sakshitha news

శ్రీ రామ లింగేశ్వర స్వామి ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా” భూక్యా మురళి నాయక్

సాక్షిత : మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని శ్రీ రామ లింగేశ్వర స్వామి దేవస్థానంలో ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపన యంత్ర ప్రతిష్ఠ, నవగ్రహ, సుబ్రహ్మణ్య స్వామి, వాసవి మాత ప్రతిష్ఠ, దేవాలయ సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే డా” భూక్యా మురళి నాయక్ మాట్లాడుతూ రామలింగేశ్వర స్వామి వారి పూజ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి పాటుపడుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు..అంతేకాకుండా ఈ ఆలయ అభివృద్ధిలో భాగంగా శ్రీ రామ లింగేశ్వర స్వామి దేవస్థానంలో పాకశాల నిర్మాణానికి ఎమ్మెల్యే గారు తన సొంత నిధుల నుండి 3లక్షల రూపాయలు ఇస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు… శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి ఆశీస్సులు నెల్లికుదురు గ్రామ ప్రజల పై ఉండాలని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో పడి పంటలు బాగా పండాలని ఆ దేవుణ్ణి వేడుకున్నారు.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారీ వెంట జిల్లా సీనియర్ నాయకులు,మండల నాయకులు నెల్లికుదురు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,పాల్గొన్నారు….