శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం అమ్మవారి పాత మెట్లు మార్గం లో పైకి చేరిన తరువాత అమ్మవారి చిన్న రాజగోపురం ప్రాంతంలో ఉన్న సిమెంట్ సింహాలు స్థానంలో ఇరువైపుల పాలరాతితో సుమారు 7 లక్షల రూపాయలతో సింహాలను తయారు చేయించడానికి శ్రీ వేగుంట మధుసూదన్ రావు, హైదరాబాద్ వారు ముందుకు వచ్చారు. పాలరాతి సింహాలు తయారు చేయుటకు జైపూర్ నుండి వచ్చిన రాధా రాణి మూర్తి ఆర్ట్ కంపెనీ వారు, ఈ విషయం పై చర్చించుటకు ఈరోజు కార్యనిర్వహణాధికారి శ్రీనా నాయక్, దేవస్థానం చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ(గాంధీ) మరియు ప్రధాన అర్చకులు శ్రీ ఎల్.దుర్గాప్రసాద్ వార్లను కలిసి, సింహాల కొలతలు తీసుకుని వెళ్లారు.వీలైనంత త్వరగా సింహాల ప్రతిమలు విజయవాడకు చేరుస్తామని తయారీదారు ప్రతినిధులు తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
