సోషల్ వెల్ఫేర్ గురుకుల ఇంటర్ ప్రవేశాలకు జూలై 6న స్పాట్ కౌన్సిలింగ్…
–ఉటూరి శ్రీనాథ్…
మంథని, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం న స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు పెద్దపల్లి జిల్లా సాంఘిక సంక్షేమ గురుకులాల సంస్థ సమన్వయ అధికారి ఉటూరి శ్రీనాథ్ తెలిపారు.
ఆయన విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలు మంథని, పెద్దపల్లి (బాలురు), రామగుండం, మల్లాపూర్, నందిమేడారం, గర్రెపల్లి (బాలికలు)లో మిగిలిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బైపీసీ, ఎంపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపుల సీట్ల భర్తీ కోసం స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటికే ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా రెండు విడతల్లో సీట్ల భర్తీ పూర్తయిందని, మిగిలిన ఖాళీలను భర్తీ చేసేందుకు మంథనిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల (బాలురు)లో స్పాట్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అభ్యర్థుల నమోదు ప్రక్రియ నిర్వహించి, అనంతరం స్పాట్ కౌన్సిలింగ్ చేపడతామని తెలిపారు.
అర్హులైన విద్యార్థులు పదో తరగతి ఉత్తీర్ణత పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు వాటి రెండు సెట్ల జిరాక్స్ ప్రతులు, విద్యార్థి ఆధార్ కార్డు జిరాక్స్, తల్లిదండ్రుల ఆధార్ కార్డు జిరాక్స్, నాలుగు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో కౌన్సిలింగ్ కేంద్రానికి హాజరుకావాలని ఉటూరి శ్రీనాథ్ సూచించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
