వేసవి తీవ్రతకు గీతాకార్మికుడు మృతి
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలో ఎండల తీవ్రత ప్రాణాలు తీస్తోంది. గ్రామానికి చెందిన గీతాకార్మికుడు బంటు రాములు (54) మధ్యాహ్నం తీవ్రమైన వేడిని తట్టుకోలేక మృతి చెందారు. ఇటీవల రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రత్యేకంగా చిన్నపిల్లలు, వృద్ధులు, బయట పనులు చేసే కార్మికులు జాగ్రత్తలు తప్పక వహించాల్సిందే. ఎండ తీవ్రత కొనసాగితే ఇలాంటి ఘటనలు మరింత పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా, జిల్లా కలెక్టర్ తేజస్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తగినంత నీరు తాగడం, చల్లని ప్రదేశాల్లో ఉండడం వంటి జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
