ఎన్టిపిసి సిఐటియు ఆధ్వర్యంలో సామాజిక న్యాయ సాధన పోరాట సంఘీభావ నిధి వసూలు…
సాక్షిత పెద్దపల్లి : ఎన్టిపిసి గేట్ నెంబర్ 2 వద్ద సామాజిక న్యాయ సాధన క్యాంపెన్లో భాగంగా సిఐటియు అనుబంధ రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సామాజిక ఉద్యమ సహాయ నిధిని వసూలు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ బిక్షపతి మరియు యూనియన్ ప్రధాన కార్యదర్శి గీట్ల లక్ష్మారెడ్డి గారలు మాట్లాడుతూ, 2026 ఏప్రిల్ 6 సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ బీటీ రణధీవే వర్ధంతి నుండి ఏప్రిల్ 15 వరకు తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయ సాధన క్యాంపెయిన్ నిర్వహించాలని సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.
ఈ క్యాంపెన్లో భాగంగా సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు బి టి రణదీవే వర్ధంతి, జ్యోతిరావు పూలే జయంతి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వంటి మహనీయుల జన్మదిన, వర్ధంతి సభలతో పాటుగా సెమినార్లు, సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. సామాజిక ఉద్యమ సహాయ నిధిని వసూలు చేయాలి, దానిలో భాగంగానే ఈరోజు ఎన్టిపిసి గేట్ నెంబర్ 2 వద్ద సామాజిక ఉద్యమ నిధి ₹ 3313/- వసూలు చేయడం జరిగింది.
ఈ నిధిని సిఐటియు జిల్లా కమిటీ ద్వారా రాష్ట్ర కమిటీకి పంపించడం జరుగుతుంది. ఈ సామాజిక ఉద్యమ నిధిని సామాజిక వివక్షతలు కు వ్యతిరేకంగా పోరాడుతున్న సంఘాలకు సంఘీభావ నిధిని ఇవ్వడం జరుగుతుంది. ఈ సంఘీభావం నిధికి విరాళాలు ఇచ్చిన కార్మిక లందరికీ నాయకులు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ బిక్షపతి, జిల్లా కోశాధికారి ఎం రామాచారి, రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి గీట్ల లక్ష్మారెడ్డి, ఉపాధ్యక్షులు దండ రాఘవరెడ్డి, ఎండి షమీం, వడ్నాల శ్రీనివాస్ , కృష్ణ కుమార్, కుమార్, రాజమల్లు, సంతోష్ , సంపత్, మణికంఠ, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY