విచారణకు హాజరు కానీ జిల్లా కలెక్టర్ ,ఫారెస్ట్ అధికారులపై
జాతీయ ఎస్టీ కమిషన్ ఆగ్రహం………తెలంగాణబంజారా గిరిజన విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు శివనాయక్ వెల్లడి
సాక్షిత వనపర్తి
నెల రోజుల క్రితం వనపర్తి జిల్లా ఫారెస్ట్ అధికారులపై గిరిజన రైతులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని జాతీయ ఎస్టి కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది . స్పందించిన జాతీయ ఎస్టీ కమిషన్ ఫారెస్ట్ అధికారులపై మరియు వనపర్తి జిల్లా కలెక్టర్కు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేయడం జరిగింది నోటీసుకు స్పందించని జిల్లా ఫారెస్ట్ అధికారి పై మరియు జిల్లా కలెక్టర్ పై జాతీయ ఎస్టీ కమిషన్ సీరియస్ అయ్యారు వెంటనే పై అధికారులు కు నోటీసు జారీ చేస్తామని ాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ తెలిపారు మంగళవారంఢిల్లీలో జరిగిన హియరింగ్ విచారణకు వనపర్తి జిల్లా కలెక్టర్ మరియు ఫారెస్ట్ అధికారులు హాజరు కావాల్సి ఉండగా, వారు విచారణకు గైర్హాజరుకావడం తీవ్ర పరిగణలోకి తీసుకోవాల్సిన విషయం అని బంజారా గిరిజన విద్యార్థి సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శివనాయక్ పేర్కొన్నారు.
వనపర్తి జిల్లా పెద్దగూడెం క్రిష్ణగిరి తండాకు చెందిన గిరిజనులను ఇబ్బందులను గురి చేస్తున్నారని దాదాపుగా ఈ భారతదేశానికి స్వాతంత్రం రాక ముందు నుంచి అక్కడ లంబాడా బిడ్డలు సాగు చేస్తున్న భూములను ఇబ్బందులను గురి చేస్తున్నారని గిరిజన భూములను ఎవరు కూడా లాక్కోవద్దని గిరిజన బిడ్డలకు అన్యాయం చేయకూడదని గిరిజన సంఘ నాయకులు తమ వాదనలు వివరంగా కమిషన్‌కు వినిపించారు. పోలీసులు అధికారు లు వారి బాధ్యతలను నిర్లక్ష్యం చేయడం, ప్రత్యేకించి గిరిజనులపై వేధింపుల కేసుల్లో విచారణకు హాజరుకాకపోవడం అత్యంత తీవ్రమైన ఛర్యగా పేర్కొన్నారు.
” కమిషన్ విచారణకు హాజరు కాకపోవడం వనపర్తి జిల్లా అధికారుల పట్ల విశ్వాసం కోల్పోయేలా చేస్తోంది” అని శివ నాయక్ అన్నారు.
ఈ సందర్భంగా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ విచారణలో అధికారుల హాజరు విషయాన్ని సీరియస్‌గా పరిగణించి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేందుకు చర్యలు ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో గిరిజన సంఘానికి చెందిన పలువురు నాయకులు పాల్గొని, తమ ఆవేదనను మరియు చట్టబద్ధమైన డిమాండ్లను కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.
