గోదావరిఖని సింగరేణి స్టేడియంలో సామాజిక సమతా వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న అంబేద్కర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎంపీ వంశీకృష్ణ….
సాక్షిత పెద్దపల్లి//గోదావరిఖని: గోదావరిఖని సింగరేణి స్టేడియంలో సామాజిక సమతా వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న అంబేద్కర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎంపీ వంశీకృష్ణ. వంశీకృష్ణకు ఘన స్వాగతం పలికి శాలువాలతో సన్మానించిన క్రికెట్ అసోసియేషన్ సభ్యులు.
ఈ సందర్బంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ… ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాలలో తెలంగాణ రాష్ట్రానికి రావలసిన నిధులపై పార్లమెంట్ లో గలమెత్తి మాట్లాడడం జరిగిందని,
ఆంధ్ర ప్రాంతానికి ఎక్కువ నిధులు కేటాయిస్తూ, తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని అన్నారు.
తెలంగాణ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన ఎంపీ కిషన్ రెడ్డి తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎందుకు న్యాయం చేయడం లేదంటూ ప్రశ్నించడం జరిగింది.
పది సంవత్సరాలు దేశాన్ని పాలిస్తున్న బిజెపి తెలంగాణ ప్రాంతానికి ఎందుకు అన్యాయం చేస్తుందని ప్రశ్నించారు..?
ఆంధ్రలో 9 విమానాశ్రయాలు ఉంటే తెలంగాణలో మాత్రం ఒకటే ఎయిర్ పోర్ట్ ఉండడం ఏంటి…?
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈఎస్ఐ ఆసుపత్రి కావాలని పలుమార్లు ప్రస్తావించిన నిధులు కేటాయించడం లేదు.
కార్మికుల సంక్షేమం కోసం ఈఎస్ఐ ఆసుపత్రి వచ్చేంతవరకు పోరాడుతాం ఆని, గతంలో దివంగత కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి తీసుకువచ్చిన సింగరేణి పెన్షన్ పెంచాలని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, సింగరేణి విశ్రాంతి కార్మికులకు పదివేల రూపాయల పెన్షన్ ఇచ్చేలా చర్యలు చేపడతాం ఆని తెలిపారు.
సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు కోసం పార్లమెంట్ లో మాట్లాడడం జరిగిందని,పెద్దపల్లి పార్లమెంటు ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ నాకు ఉండాలని మనకు రావలిసిన నిధుల కోసం ఇంక పోరాడుతానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశి కృష్ణ తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY