కేంద్ర ప్రభుత్వ పథకాల్ని చిరు, వీధి వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలి : ప్రత్తిపాటి
- ట్రాఫిక్ కు, ప్రజలకు ఇబ్బంది లేకుండా వ్యాపారులు తమ కార్యకలాపాలు నిర్వహించుకోవాలి.
- చిరు .. వీధి వ్యాపారులకు 25 తోపుడు బండ్లు అందచేసిన మాజీమంత్రి ప్రత్తిపాటి.
చిరు, వీధి వ్యాపారులు ప్రయోజనాల కోసం కూటమిప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ స్ట్రీట్ బజార్లు ఏర్పాటు చేయాలన్నఆలోచనలో ఉందని, ఇప్పటికే నెల్లూరు పట్టణంలో అధునాతన హంగులతో కొన్ని దుకాణాలు ఏర్పాటు చేసి వ్యాపారులకు ఇవ్వడం జరిగిందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మంగళవారం ఆయన పట్టణంలోని వీధి, చిరు వ్యాపారులకు జేడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లిఖార్జునరావు తో కలిసి తోపుడు బండ్లు అందచేశారు. స్థానిక రోటరీ క్లబ్ సభ్యులు, టీడీపీ నాయకులు కీ.శే తియ్యగుర కోటిరెడ్డి, మక్కెన చిన్నరమయ్య జ్ఞాపకార్థం రోటరీ విభాగం తయారుచేయించిన 25 బండ్లను 25 మంది లబ్ధిదారులకు అందించిన అనంతరం ప్రత్తిపాటి మీడియాతో మాట్లాడారు.
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై చిరు, వీధి వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలన్న ప్రత్తిపాటి. ఆర్థిక క్రమశిక్షణ, నాణ్యతతో కూడిన వస్తువులు, ఆహారపదార్థాల విక్రయంతో వ్యాపారంలో రాణించవచ్చ న్నారు.
బ్యాంకులు చిరు, వీధి వ్యాపారులు ఉన్నతికి సహకరించాలి..
చిరు, వీధి వ్యాపారుల పనితీరు, ప్రతిభ, ఆదాయాన్ని కొలమానంగా తీసుకొని బ్యాంకులు వారి వ్యాపారా భివృద్ధికి సహకరించాలని ప్రత్తిపాటి సూచించారు. పట్టణంలోని చిరు, వీధి వ్యాపారులకు ప్రభుత్వపరంగా అవసరమైన సహయసహకారాలు అందిస్తామని, వారు కూడా బాధ్యతాయుతంగా వ్యాపారాలు నిర్వహించుకోవాలన్నారు. ప్రధాన కూడళ్లలో వ్యాపారాలు చేసుకునేవారికి తోపుడు బండ్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ట్రాఫిక్ కు అడ్డంకులు లేకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చిరు వ్యాపారులు తమ కార్యకలాపాలు కొనసాగించుకోవాలని ఈ సందర్భంగా ప్రత్తిపాటి సూచించారు. తోపుడు బండ్లు అందించిన రోటరీ క్లబ్ సభ్యులు ఉప్పుటూరి ప్రసాద్, రామ సుబ్బారావు, చిలుకూరి శ్రీనివాసరావు, అడుసుమల్లి మోహనరావు తదితరులకు ఈ సందర్భంగా ప్రత్తిపాటి ప్రత్యేక అభినందనలు తెలిపారు. స్థానిక విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రి అందజేత, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో కూడా తమ వంతు సేవలందిస్తున్న రోటరీ క్లబ్ నిర్వాహకుల సేవలు వెలకట్టలేనివని ప్రత్తిపాటి చెప్పారు.
కార్యక్రమంలో జనసేన ఇంచార్జి తోట రాజారమేష్, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, టీడీపీ నాయకులు తేళ్ల సుబ్బారావు, పఠాన్ సమాధ్ ఖాన్, మద్దుమలా రవి, మల్లెల శివనాగేశ్వరరావు, మద్దిబోయిన శివ, మురకొండ మల్లిబాబు, రోటరీ క్లబ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
