స్విమ్స్ విద్యార్ధికి డాక్టరేట్ ప్రధానం
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) యూనివర్సిటీ ఫిజియోథెరపి విభాగంలో పరిశోధనలు నిర్వహించిన విద్యార్థి డా. మూడే గోవిందు నాయక్ కి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పి.హెచ్.డి) పట్టాను ప్రధానం చేసినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డా.రామ్ తెలిపారు. స్విమ్స్ పరిశోధక విద్యార్థి డా. మూడే గోవిందు నాయక్ ఫ్యాకల్టీ ఆఫ్ ఫిజియోథెరపి విభాగంలో “ఎఫెక్ట్ ఆఫ్ వర్చువల్ రియాలిటీ ట్రైనింగ్ ఆన్ హ్యాండ్ ఫంక్షన్ ఇన్ సబ్జెక్ట్ విత్ స్ట్రోక్: ఎ రండోమైజ్డ్ కంట్రోల్ ట్రైల్” అనే అంశముపై పరిశోధనను నిర్వహించారు.
చీఫ్ గైడ్ అసోసియేట్ ప్రొఫెసర్ డా. వి.కుమార పర్యవేక్షణలో సమర్పించిన ఈ గ్రంథాన్ని యూనివర్సిటి బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వారు పరిశీలించి పి.హెచ్.డి. డిగ్రీ ప్రధానం చేసినట్లు *కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా.శిల్పా కడియాల అధికారంగా ప్రకటించారు. ఈ సందర్భంగా పరిశోధక విద్యార్థి గోవిందు నాయక్ ని స్విమ్స్ సంచాలకులు డా. ఆర్.వి.కుమార్, డీన్ డా.అలోక్ సచన్, మెడికల్ సూపరింటెండెంట్ డా. రామ్, ఆర్‌ఎంఓ డా. వెంకట కోటిరెడ్డి, వివిధ విభాగాధిపతులు, సిబ్బంది, విద్యార్ధినీ విద్యార్ధులు, అభినందనలు తెలియజేశారు.
