“నినాదం దినపత్రిక” 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి చేతుల మీదుగా
“నినాదం దినపత్రిక – 2026 నూతన సంవత్సర క్యాలెండర్” ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.
బాచుపల్లి లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కొలన్ హన్మంత్ రెడ్డి క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల సమస్యలను నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చే బాధ్యతాయుతమైన పాత్రను మీడియా నిర్వహించాలన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర కీలకమని, నినాదం దినపత్రిక ప్రజల గొంతుకగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సర క్యాలెండర్ దినపత్రిక అభివృద్ధికి మరింత దోహదపడాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ సంజీవ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు సోమన్న శ్రీధర్ రెడ్డి, హరి కిరణ్ పటేల్, చందు ముదిరాజ్, రాజు చారి, గోగికర్ కరణ్, శ్రవాన్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
