ఆర్కే గుడ్ టైమ్స్ రెస్టారెంట్‌ను ప్రారంభించిన సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి
కుత్బుల్లాపూర్,
జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 10లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్కే గుడ్ టైమ్స్ రెస్టారెంట్‌ను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ప్రారంభించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గంధం పృథ్వి ఆహ్వానం మేరకు… ముఖ్య అతిథులుగా హాజరైన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఆర్కే గుడ్ టైమ్స్ రెస్టారెంట్‌ను ప్రారంభించి…హోటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. కస్టమర్లకు మంచి ఆహారాన్ని అందించి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రమేష్, శివ, రాజేష్, కృష్ణ, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.

