డ్రైనేజి కాలువలలో సిల్ట్ క్లియరెన్స్ పనులు పరిశీలించిన మోర్ల సుప్రజ
సాక్షిత : బుచ్చిరెడ్డిపాలెం నగరపంచాయితి పరిధిలో బాంబే రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజ్ కాలువలలో జరుగుతున్న పూడికతీత పనులను అధికారులతో కలిసి చైర్ పర్సన్ మోర్ల సుప్రజ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మోర్ల సుప్రజ బాంబే రోడ్డుకు ఇరువైపులా పూడిక తీత పనుల నిర్వహణ నిమిత్తం స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించుకున్న వ్యాపారస్తులను అభినందించారు. అనంతరం వారుమాట్లాడుతూ బాంబే రోడ్డుకు ఇరువైపులా షుమారు 3.5 కిలోమీటర్ల సైడ్ డ్రైన్లు ఆక్రమణలకు గురై వున్నాయన్నారు. రానున్న వర్షాకాలంలో రోడ్లపై వర్షపు నీళ్ళు నిలిచిపోయి పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో డ్రైనేజీ కాలువలలో పూడికతీత పనులు చేపట్టామన్నారు. 10 లక్షల రూపాయలు వెచ్చించి పీర్ల కాలువ నుండి జండా దిబ్బ రోడ్డు వరకు గల కాలువ మరియు కె యం హాస్పిటల్ నుండి రాఘవ రెడ్డి కాలనీ ప్రాంతంలో జరుగుతున్న పూడిక పనులను ఆమె పరిశీలించారు. ఆక్రమణల తొలగింపుకు సంబంధించి నగర పంచాయతీ అధికారులు వేసిన మార్కింగ్ ల పై ప్రజలు ఎటువంటి అపోహలు గురికావద్దని ఆమె తెలిపారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సహకారంతో బుచ్చిరెడ్డిపాలెం పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి బాలకృష్ణ, 10 వార్డు కౌన్సిలర్ బెలూం మల్లారెడ్డి మరియు నగర పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు….
