సిద్దేశ్వర తీర‌్థ ఆశ‌్రమంలో దేవాదాయ మంత్రి ఆనం
సాక్షిత ప్రతినిధి – చంద్రగిరి: చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలం, సి రామాపురం లో ఉన్న బ్రహ్మర్షి గురూజీ సిద్దేశ్వర తీర‌్థ ఆశ‌్రమాన‌్ని మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్‌చంద్ర రాంగుళం, వీణా రాంగుళo దంపతులు సందర్శించారు. సిద్దేశ్వర తీర‌్థ ఆశ‌్రమ పీఠాధిపతి బ్రహ్మర్షి గురువానంద గురుజీ, రాష్ట్రదేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, తిరుపతి యంపి డాక్టర్ గురుమూర్తి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర‌్తి నాని, తుడా అధ్యక్షులు డాలర్స్ దివాకర్ రెడ్డిలతో మారిషస్ ప్రధానమంత్రికి శంఖానాధంతో అపూర్వ స్వాగతం పలికారు. ప్రధానమంత్రి దంపతులను పీఠాధిపతి బ్రహ్మర్షి గురువానంద గురూజీ శాలువాలు కప్పి ,ప్రత్యేక జ్ఞాపికలను అందించి, ఆశిర‌్వదించారు. ఈ సందర్భంగా బ్రహ్మర్షి గురువానంద గురూజీ మాట్లాడుతూ ఉన్నత స్థితిలో ఉండినా సింపుల్ గా జీవనం సాగించటం నవీన్‌చంద్ర రాంగుళo ప్రత్యేకత అని ప్రశంసించారు. డా నవీన్‌చంద్ర రాంగుళo తండ్రి శివశంకర్ రాంగుళo మారిషస్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేయడం వలన”మారిషెష్ పితామహుడు”గా పేరుగాంచినట్లు తెలిపారు. నవీన్‌చంద్ర రాంగుళo చేపట్టిన ప్రజా సేవకు గుర్తింపుగా ఇప్పటికే నాలుగు పర్యాయాలు మారిషస్ ప్రధానమంత్రిగా ఎంపికయ్యారని తెలిపారు. మరింత దీర్ఘ కాలం నవీన్‌చంద్ర రాంగుళo ఉన్నత పదవిలో ఉండగలరని గురూజీ ఆశాభావం వ్యక్తం చేసారు. మారిషన్ ప్రధాన మంత్రి డా, నవీన్‌చంద్ర రాంగుళo దంపతులను “లక్ష్మీనారాయణలు”గా గురూజీ పేర్కొన్నారు. బ్రహ్మర్షి ఆశ్రమం నుంచి మారిషస్ దేశంలో విద్య వైద్య అభివృద్ధికి వెయ్యి మిలియన్ల డాలర్లను వితరణ చేస్తున్నట్లు గురూజీ ప్రకటించారు. మారిషష్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్‌చంద్ర రాంగుళo మాట్లాడుతూ హిందువుగా బ్రహ్మర్షి ఆశ్రమానికి రావటం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు
గురూజీ ఆశీస్సులతో తాను నాలుగు సార్లు మారిషష్కు ప్రధానమంత్రి అయ్యానని తెలిపారు. గురూజీకి కృతజ్ఞతలు తెలియజేసి, వారి ఆశీస్సులు పొందటానికి ఆశ్రమానికి వచ్చానని మారిషస్ ప్రధాన మంత్రి డా, నవీన్‌చంద్ర రాంగుళo తెలిపారు. అనంతరం గురూజీ ఆశ్రమం నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. బ్రహ్మర్షి ఆశ్రమం వద్ద తిరుపతి జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ఆర్ సి పురం తహసిల్దార్
మధుసూదన్ రావు పలువురు అధికారులు మారిషన్ ప్రధాన మంత్రి డా, నవీన్‌చంద్ర రాంగుళం కు వీడ్కోలు పలికారు.
