శంకర్‌పల్లి శ్రీరామాలయం ఆధ్వర్యంలో సిద్ధార్థ హాస్పిటల్ వారి ఉచిత పరీక్షలు, మందుల పంపిణీ
70 మందికి ఉచిత వైద్య సేవలు
….
శంకర్‌పల్లి: (సాక్షిత): శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని రైల్వే స్టేషన్ సమీపానగల శ్రీరామాలయం ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం సిద్ధార్థ హాస్పిటల్ వారి ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది. ఈ సందర్భంగా ఈఎన్ టి, ఆర్థోపెటిక్, జనరల్ మెడిసిన్ కు సంబంధించిన వైద్యులు డా. అర్షియా షేక్, డా. అజయ్ కుమార్, డా. కృష్ణప్రసాద్ ప్రత్యేక బృందంగా హాజరై, 70 మంది ప్రజలకు ఉచితంగా బీపీ, బరువు, రక్త పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులను పంపిణీ చేశారు. మార్కెటింగ్ మేనేజర్ భీమయ్య హెల్త్ క్యాంపు విజయానికి కృషి చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY