” 150 వ వసంతం సందర్భం గా శ్రీ ఎస్ పి ఆర్ గ్లోబల్ స్కూల్ నందు వందేమాతర గీతాలాపన “
కుత్బుల్లాపూర్ మండలం, గాజులరామారం డివిజన్ నందు కల ఎస్ పి ఆర్ గ్లోబల్ స్కూల్ నందు స్కూల్ ఛైర్మన్ మరియు ఫౌండర్ సొంటిరెడ్డి పున్నారెడ్డి ఆధ్వర్యం లో 150 వ వసంతం సందర్భం గా వందేమాతర గీతాలాపన ఘనం గా జరిగింది.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ బంకించంద్ర ఛటర్జీ 1875 నవంబరు 7న రచించారు అని అహింసాయుత భారత స్వాతంత్ర్య ఉద్యమంలో
రణనినాదంగా ఉపయోగపడింది అని,స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ గేయాన్ని జాతీయ గేయంగా భారత ప్రభుత్వం స్వీకరించింది అని చిన్నారులకు వివరించారు.
ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి. గ్లోరి విల్సన్, ఉపాధ్యాయులు, చిన్నారులు పాల్గొన్నారు.

