జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్

Sakshitha news

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారంలో – ఎమ్మెల్యే డా భూక్యా మురళీ నాయక్ పర్యటన..


మహబూబాబాద్ నియోజకవర్గం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ పార్టీ శ్రేణులు శక్తివంతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు.ఈ క్రమంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే డా భూక్యా మురళీ నాయక్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా బోరాబండ, వినాయక నగర్ ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులతో కలిసి డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించారు..

ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడిన ఎమ్మెల్యే రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బలమైన ప్రతినిధి కావాల్సిన సమయం ఇది. జూబ్లీహిల్స్ ప్రజలు ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని ఘన విజయంతో గెలిపించాలని పిలుపునిచ్చారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా మురళీ నాయక్ మాట్లాడుతూ.. ప్రజల మనస్సుల్లో కాంగ్రెస్ పునరుజ్జీవన వాతావరణం నెలకొంది. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సేవలు, సంక్షేమ పథకాలు అందరికీ చేరేలా చేస్తున్నాయి. జూబ్లీహిల్స్ ప్రాంతం కూడా ఆ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. నవీన్ యాదవ్ గెలిస్తే ప్రాంత అభివృద్ధికి నూతన ఉత్సాహం వస్తుంది, అని తెలిపారు..

నవీన్ యాదవ్ యువ నాయకుడు, జూబ్లీహిల్స్ ప్రజలకు చేరువయ్యే వ్యక్తి. ఆయన గెలుపు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాదు, ఈ ప్రాంత అభివృద్ధికి కూడా ఒక దారిదీపం అవుతుంది. మహిళా ఓటర్లు కూడా కాంగ్రెస్పై విశ్వాసంతో ముందుకు వస్తున్నారు, అని పేర్కొన్నారు..

ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అజ్మీర సురేష్ నాయక్,KKC దిలీప్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకులు గంధసిరి శ్రావణ్,మహబూబాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు స్వర్ణలత, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు

Scroll to Top