షాదీఖానా నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తాం….
–మేయర్ మహంకాళి స్వామి….
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: రామగుండం,ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ సహకారంతో షాదీఖానా నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి హామీ ఇచ్చారు.
రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో ముస్లిం మత పెద్దలతో సమావేశమైన ఆయన, ఎమ్మెల్యేగా రాజ్ ఠాకూర్ ఎన్నికైన తర్వాత ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. ఇంకా చేపట్టాల్సిన పనులపై సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు.
పార్టీలు, మతాలకు అతీతంగా రామగుండం నగర అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే వెయ్యి కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా నగర రూపురేఖలు మారాయని పేర్కొన్నారు.
రామగుండం అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యేకు ప్రజలు అండగా నిలిచి ప్రోత్సహించాలని మేయర్ మహంకాళి స్వామి కోరారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
