విద్యార్థుల చేతుల్లో స్కూల్ బ్యాగులు…

Sakshitha news

విద్యార్థుల చేతుల్లో స్కూల్ బ్యాగులు…

ఎమ్మెల్యే జన్మదిన వేడుకలకు సేవా స్పర్శ
రాజ్ ఠాకూర్ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు బ్యాగుల పంపిణీ….

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, రామగుండం/ : రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ముందస్తుగా విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు, మక్కాన్ సింగ్ సేవా సమితి సభ్యుడు నాంపల్లి రాజ్ ఆధ్వర్యంలో పవర్‌హౌస్ కాలనీలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బ్యాగుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి 4వ డివిజన్ కార్పొరేటర్ కంకణాల మౌనిక రాజు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి విద్యార్థులకు స్కూల్ బ్యాగులను అందజేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ జన్మదినాన్ని పురస్కరించుకుని విద్యార్థులను ప్రోత్సహించేలా సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులోనూ విద్యార్థులు, పేదల సంక్షేమానికి ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగించాలని సూచించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్‌కు ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బాదం వసంత, సుమన్, శ్రీను, పెసరి శ్యామల తదితరులు పాల్గొన్నారు

Scroll to Top