సర్వాంగ సుందరంగా శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి అమ్మవారి కళ్యాణం
సాక్షిత : అమ్మవారికి బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం సారె సమర్పించిన ఎమ్మెల్యే
కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
ప్రజలందరి పై అమ్మవారి కరుణ, కటాక్షం ఉండాలి-
బుచ్చిరెడ్డిపాళెం జోన్నవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మల్లిఖార్జున స్వామి సమేత కామాక్షి తాయీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు వేడుకగా బాగంగా నిర్వహించిన కళ్యాణ వేడుకలలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గోని ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ బ్రహ్మోత్సవాలలో విజయవాడ లో వెలసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నుండి శ్రీ మల్లిఖార్జున స్వామి కామాక్షితాయి అమ్మవారికీ అక్కడి మర్యాదలతో వచ్చిన శాశ్వత సారే ను అమ్మవారికి ఎమ్మేల్యే సమర్పించారు..
ఆలయ చైర్మన్ తిరుమూరి అశోక్ రెడ్డి, వేద పండితులు ,పాలకమండలి సభ్యులు మేళ తాళాలతో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కి, విజయవాడ నుండి వచ్చిన దేవస్థానం పాలకమండలి సభ్యులుకు,వేద పండితులకు, ఇతర అధికారులకు, వారు ఘన స్వాగతం పలికారు.రాష్ట్రం సుభిక్షంగా, పచ్చగా, ఉండాలని ఎమ్మేల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణతో, మంగళ వాయిద్యాలతో, మేళ తాళాలతో సాంప్రదాయబద్ధంగా కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. దీన్ని చూసి పరవశించిన భక్తజనం. అనంతరం ప్రజలందరికీ అన్న ప్రసాదాలు అందించడం జరిగింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, ధర్మకర్తలుపాలక మండలి ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఆలయ చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి దంపతులు, ఈవో, ధర్మకర్తల పాలకమండలి, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
