భావితరాలకు స్ఫూర్తి సర్దార్ భగత్ సింగ్…
భగత్ సింగ్ 95వ. వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు
ఖని లో భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి….
సాక్షిత పెద్దపల్లి//రామగుండం:మార్చ్ 23. స్వాతంత్ర సమరయోధుడు కామ్రేడ్ సర్దార్ భగత్ సింగ్ 95వ. వర్ధంతి సందర్భంగా స్థానిక భాస్కరరావు భవన్లో సోమవారం నాడు అఖిల భారత విద్యార్థి -యువజన సమాఖ్య (ఏఐఎస్ఎఫ్-ఏఐవై ఎఫ్) రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో… సర్దార్ భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఏఐవై ఎఫ్ జిల్లా కార్యదర్శి కార్పొరేటర్ మార్కపురి సూర్య ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం మాట్లాడుతూ “స్వాతంత్ర సంగ్రామంలో ఉరితాడును ముద్దాడిన యోధుడు సర్దార్ భగత్ సింగ్ అని అతని జీవితం ఎంతోమంది యువకులకు ఆదర్శమని వారన్నారు.
23 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ పాలకుల వెన్నులో వణుకు పుట్టించే విధంగా పార్లమెంట్ పై బాంబు వేసి తన స్వతంత్ర కాంక్షను తెలియజేసిన ధీరుడు కామ్రేడ్ సర్దార్ భగత్ సింగ్ అని అంతేకాకుండా స్వతంత్ర సంగ్రామంలో లాలా లజపతిరాయ్, గాంధీజీలు చేసే ఉద్యమానికి ఆకర్షితుడైన భగత్ సింగ్ విద్యార్థి దశనుండే స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనడం తో పాటు బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన ధీరుడు భగత్ సింగ్ అని అన్నారు.
1931 మార్చ్ 24న. భగత్ సింగ్ తో పాటు రాజ్ గురూ ,సుఖ్ దేవ్ లను ఉరితీయాలని నిర్ణయించినప్పటికీ అప్పటి చట్టాలకు వ్యతిరేకంగా 23న. రాత్రి ఆ ముగ్గురిని ఉరితీసి ముక్కలుగా నరికి సట్లైజ్ నదిలో కలపడం జరిగిందని దాన్ని నిరసిస్తూ, ఆనాడే వేలాది మంది ప్రజలు ఆ రాత్రంతా కాగడాలతో జైలు పరిసరాలను ముట్టడించారని వారు తెలిపారు.
బ్రిటిష్ పాలకుల క్షమాభిక్షను తన అరికాలితో తన్ని ఉరితాడును ముద్దాడిన భగత్ సింగ్ను పక్కనబెట్టి బ్రిటిష్ పాలకుల క్షమాభిక్ష పై బయటికి వచ్చి వారి అడుగులకు మడుగులొత్తిన సావర్కర్ జీవిత చరిత్రను ఈరోజు పాఠ్యపుస్తకాలో చేర్చడం దుర్మార్గ చర్యని అన్నారు.
భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా భగత్ సింగ్ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం కల్పించాలని , అలాగే భగత్ సింగ్ ను స్వాతంత్ర సమరయోధుడు గా గుర్తించి, ఆయన జయంతి వర్ధంతి లను ప్రభుత్వమే నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.
దేశంలో ఉన్న విద్యార్థి యువత భగత్ సింగ్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మత చాందసవాద రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రస్తుతం దేశ యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మరియు బెట్టింగ్ యాప్లకు యువత దూరంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు తాళ్లపల్లి సురేందర్ ,ఆసాలు నవీన్, రాణవేణి సుధీర్, సాధుల శివ , మాతంగి సాగర్, అనూప్ సాయి, రిషి తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
