నియోజకవర్గంలోని ఆర్ & బీ రోడ్ల మరమ్మతులకు రూ.9 కోట్ల కేటాయింపు : ప్రత్తిపాటి

Sakshitha news

నియోజకవర్గంలోని ఆర్ & బీ రోడ్ల మరమ్మతులకు రూ.9 కోట్ల కేటాయింపు : ప్రత్తిపాటి

సాక్షిత : • మూడు ప్రధాన రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చడానికి, చిన్నపాటి ప్యాచ్ వర్క్ లకు నిధులు మంజూరును స్వాగతిస్తున్నాం. : ప్రత్తిపాటి

  • ప్రజల ఇబ్బందులు గమనించి సకాలంలో స్పందించిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు నియోజకవర్గ ప్రజల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు : ప్రత్తిపాటి. కూటమి ప్రభుత్వం ప్రజాసంక్షేమంతో పాటు.. ప్రజలకు అవసరమైన కనీస వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, చంద్రబాబు నాయకత్వంలో సంక్షేమం.. అభివృద్ధి కలగలసిన సుపరిపాలనతో ప్రజలు సంతోషంగా ఉన్నారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఆర్థిక సమస్యలు వేధిస్తున్నా కూడా ప్రజలకు ఇబ్బంది కలగడకూడదన్న సదుద్దేశంతోనే వర్షాలకు దెబ్బతిన్న ఆర్ & బీ రోడ్ల మరమ్మతులు, ప్యాచ్ వర్క్ లకు ప్రభుత్వం సకాలంలో నిధులు కేటాయించిందన్నారు.
    నియోజకవర్గంలోని రోడ్ల మరమ్మతులు, ప్యాచ్ వర్క్ ల నిమిత్తం ప్రభుత్వం రూ.9 కోట్లు మంజూరు చేయడంపై ప్రత్తిపాటి పుల్లారావు హర్షం వ్యక్తంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం రూ.వెయ్యికోట్లు విడుదల చేసిందని, దానిలో భాగంగా నియోజకవర్గంలోని మూడు ప్రధాన రోడ్ల మరమ్మతులకు రూ.9 కోట్లు కేటాయించారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. దింతెనపాడు – సాతులూరు ఆర్ & బీ రోడ్డు మరమ్మతులకు రూ.5 కోట్లు, చిలకలూరిపేటలోని టిడ్కో గృహాల సమీపం నుంచి కమ్మవారిపాలెం, కట్టుబడివారిపాలెం మీదుగా యూటీ కూడలి వరకు ఉన్న రోడ్డు మరమ్మతులు, వీ.ఎన్.పీ రోడ్డు నుంచి గణపవరం మీదుగా వేలూరు వరకు ఉన్న రోడ్డు మరమ్మతులకు మరో రూ.4 కోట్లు కేటాయించినట్టు ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజల విజ్ఞప్తులపై స్పందించి రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేసిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు నియోజకవర్గ ప్రజల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్టు ఆయన చెప్పారు.