త్వరలో రోబోటిక్ సర్జరీలు
** సన్నాహాలు చేస్తున్నట్లు స్విమ్స్ డైరెక్టర్ వెల్లడి
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న తిరుపతిలోని “స్విమ్స్” ఆస్పత్రిలో త్వరలో వివిధ విభాగాల సర్జరీల కోసం రోబోటిక్ టెక్నాలజీని వినియోగించేందుకు సన్నాహాలు చేస్తున్నామని స్విమ్స్ డైరెక్టర్ కమ్ మెడికల్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ ఆర్.వి.కుమార్ వెల్లడించారు. శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) సర్జికల్ అంకాలజీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం శ్రీ పద్మావతి ఆడిటోరియంలో “డీ సెంట్రలైజింగ్ ఎక్సలెన్స్ అండ్ డెమోక్రటైజింగ్ యాక్సెస్”….(దేశంలో ఆరోగ్య సంరక్షణకు ఉజ్వల భవిష్యత్తు) అనే అంశంపై సర్గీయ సింహాద్రి సత్యనారాయణ రావు 4వ ఛైర్ ఒరేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ డైరెక్టర్ డా ఆర్.వి. కుమార్ తో పాటు న్యూ ఢిల్లీకి చెందిన ఆసియా పసిఫిక్ ఎస్.ఎస్.ఐ ఇన్నోవేషన్స్
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డా.విశ్వజ్యోతి, పి.శ్రీవాత్సవ, స్విమ్స్ డీన్ డా.అలోక్ సచన్, స్విమ్స్ రిజిస్ట్రార్ డా.అపర్ణ ఆర్.బిట్లా, పద్మావతి మహిళా వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డా.ఉషా కళావత్, మాజీ స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శీనివాసరావు, అలైడ్ హెల్త్ సైన్సెస్ హెడ్ డాక్టర్ మధుబాబు, సర్జికల్ అంకాలజి విభాగాధిపతి డా.నరేంద్ర, సర్జికల్ ఆంకాలజీ ప్రొఫెసర్ డా. మణిలాల్ పాల్గొని సంయుక్తంగా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా సింహాద్రి సత్యనారాయణ రావు చిత్రపటానికి పూలమాల సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం స్విమ్స్ డైరెక్టర్ డా.ఆర్.వి.కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా సేవలందించిన కీర్తిశేషులు సింహాద్రి సత్యనారాయణ రావు జ్ఞాపకార్థం వారి కుమారుడు డాక్టర్ చంద్రశేఖర్ రావు ప్రతి ఏడాదీ సర్జికల్ ఆంకాలజీ విభాగంలో ఛైర్ ఒరేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా సర్జికల్ రోబోటిక్ టెక్నాలజీలో విశేష కృషి చేస్తున్న న్యూఢిల్లీకి చెందిన ఎస్‌ఎస్‌ఐ ఇన్నోవేషన్స్ ఆసియా పసిఫిక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ విశ్వజ్యోతి పి శ్రీవాత్సవ కు గోల్డ్ మెడల్ ప్రదానం చేసి సన్మానించినట్లు తెలిపారు. క్యాన్సర్ విభాగంలో అందుబాటులోకి వచ్చిన అధునాత ప్రక్రియలపై వైద్యులు, వైద్య విద్యార్థులు పట్టు సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు.
సర్జికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ నరేంద్ర మాట్లాడుతూ ముఖ్యఅతిధి డా. విశ్వజ్యోతి పి శ్రీ వాత్సవ సాధించిన అవార్డుల గురించి తెలియజేశారు. వీరి ఆధ్వర్యంలో రోబోటిక్ యంత్రాలను వినియోగించి పలు ఆసుపత్రుల్లో విజయవంతంగా సర్జరీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
సర్జికల్ అంకాలజీ ప్రొఫెసర్ డాక్టర్. మణిలాల్ మాట్లాడుతూ సింహాద్రి సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ శాసన సభకు 1983వ సం: నుండి మూడు పర్యాయములు శాసన సభ్యులుగాను, దేవాదాయ శాఖా మంత్రిగాను….టీటీడీ బోర్డు మెంబర్ గానూ విశేష సేవలను అందించారని తెలిపారు. ఈ ఎండోమెంట్ ఒరేషన్ కార్యక్రమానికి మొత్తం రూ.11,00,000/- ఆర్థిక సహకారంను సర్జికల్ అంకాలజి విభాగానికి అందచేయడం జరిగిందని తెలిపారు. చైర్ ఓరేటర్ గా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫర్ ఆసియా పసిఫిక్ ఎస్. ఎస్.ఐ ఇన్నోవేషన్స్, న్యూఢల్లి డా.విశ్వజ్యోతి పి శ్రీ వత్సవా భారతదేశంలో ఆరోగ్య సంరక్షణకు ఉజ్వల భవిష్యత్తు అనే అంశంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. చివరగా ముఖ్యఅతిధి ప్రొఫెసర్ ఆఫ్ అంకాలజీ డైరెక్టర్ ఎం.ఎన్.జె ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజి డాక్టర్ విశ్వజ్యోతి పి శ్రీ వత్సవా కు స్విమ్స్ డైరెక్టర్ దుశ్శాలువాతో సన్మానించి, గోల్డ్ మెడల్ను బహూకరించి, జ్ఞాపికను, ప్రశంసా పత్రాన్ని అందచేశారు. ఈ కార్యక్రమం లో స్విమ్స్ ఆర్ఎంఓ డాక్టర్ వెంకట కోటిరెడ్డి, సీనియర్ ప్రొ. డా.శివకుమార్, కమ్యూనిటి మెడిసిన్ విభాగాధిపతి డా.నాగరాజు, జనరల్ సర్జరీ విభాగాధిపతి డా.ముత్తీశ్వరయ్య, డా. ప్రాణబంధు దాస్, మెడికల్ అంకాలజీ విభాగాధిపతి డా.భార్గవి, డా. వెంకటరామి రెడ్డి, డా.శివరామ్, మెడికల్, సర్జికల్, రేడియేషన్ అంకాలజీల వైద్యులు, వివిధ విభాగాలకు చెందిన విభాగాధిపతులు, పి.జి. వైద్య విద్యార్థులు, వైద్యులు, యం.బి.బి.ఎస్ విద్యార్థులు, సిబ్బంది, పాల్గొన్నారు.
