ప్రైవేట్ వెంచర్ కోసం ప్రభుత్వ భూమిలో రోడ్డు
దుండిగల్ మునిసిపల్ పరిధిలోని బౌరంపేట్ గ్రామం నందు ప్రైవేట్ వెంచర్ కోసం ప్రభుత్వ భూమిలోనుంచి ఎలాంటి అనుమతులు లేకుండా 40 ఫీట్ల రోడ్డు దీనికి మునిసిపల్ మరియు రెవెన్యూ అధికారులు పూర్తి సహకారం ఉంది అని స్థానికులు అంటున్నారు, గతంలో ఇదే ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 166/3,1 లో పశువుల కొట్టం వేస్తే దానిని వెంటనే తొలిగించి వారికి నోటీసులు ఇచ్చి నట్టు స్థానికులు అంటున్నారు, అలాంటిది ఇప్పుడు ఈ ప్రైవేట్ వెంచర్ మీద మునిసిపల్ మరియు రెవెన్యూ అధికారులకి ఇంత ప్రేమ ఏంటో అని స్థానికులు ముక్కున వేలు వేసుకుంటున్నారు, దీని మీద ఎన్ని ఫిర్యాదులు వెళ్లిన, ఎంత మంది చర్యలు కోరిన అధికారులకి మాత్రం వినిపించటం కనిపించటం లేదు అంటున్న స్థానికులు ప్రైవేట్ వెంచర్ల కోసం ప్రభుత్వ భూమి లోని చెట్లని సైతం తీసి శుభ్రం చేసి నలబై ఫీట్ల రోడ్డు వేసి ప్రైవేట్ వెంచర్ల మీద చూపించే ప్రేమ స్థానికంగా ప్రజలు ఉంటున్న రోడ్లని కూడా మరమతులు చేస్తే ఎంతో బాగుంటుంది అంటున్న స్థానికులు, ప్రభుత్వాలు మారిన ప్రభుత్వ భూముల కబ్జాలు ఆగటంలేదు అంటున్న ప్రజలు, ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరచి ప్రభుత్వ భూములని కాపాడతారో లేదో చూడాలి, ఇలాంటి ప్రైవేట్ వెంచర్లకి అప్పనంగా ప్రభుత్వ భూములను తమ జాగిరిలాగా అప్పగించే అధికారుల పైన చర్యలు చేపట్టాలని అక్కడి స్థానిక ప్రజలు కోరుతున్నారు
