పెద్దపల్లి అభివృద్ధి, ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష….
క్యాప్షన్: పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యం.. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై చర్చ….
సాక్షిత పెద్దపల్లి జిల్లా ప్రతినిధి, జగిత్యాల/ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై జగిత్యాల జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పాల్గొన్నారు.
సమావేశంలో పెద్దపల్లి నియోజకవర్గంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతితో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, లబ్ధిదారులకు అందుతున్న ప్రయోజనాలు, పనుల పురోగతి తదితర అంశాలపై విజయరమణారావు చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అంశాలను మంత్రి, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ సమీక్షలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పలు జిల్లాల కలెక్టర్లు, శాసనసభ్యులు పాల్గొని ఆయా జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు.
ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో సూచించారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
