విశ్రాంత ఉద్యోగులు సమాజసేవ చేయాలి..

Sakshitha news

విశ్రాంత ఉద్యోగులు సమాజసేవ చేయాలి……………. సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్

భావి సమాజానికి దిశా నిర్దేశం చేయాల్సింది విద్యావేత్తలు, ఉద్యోగులే

సాక్షిత వనపర్తి : విశ్రాంత ఉపాధ్యాయులు,ఉద్యోగులు సామాజిక ప్రజా సేవలోకి రావాలని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ కోరారు.ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన మద్దిలేటి, నరేంద్రచారిలను శుక్రవారం కళావేదిక ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా పట్టణంలోని రేడియంట్ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యావేత్తలు ఉద్యోగులు సమాజానికి కళ్ళలాంటి వారని భావి సమాజానికి వారు చక్కటి దిశా నిర్దేశం చేయాల్సిన బాధ్యత ఉందని శంకర్ గౌడ్ పేర్కొన్నారు.ప్రధానోపాధ్యాయులుగా ఉపాధ్యాయులుగా మూడు దశాబ్దాలకు పైగా సేవలందించిన మద్దిలేటి, నరేంద్రచారిలను శాలువ జ్ఞాపికలతో సత్కరించారు.తన గురువైన మద్దిలేటికి స్కూటీ మోపెడ్ ను బహూకరించిన రవికుమార్ ను ప్రతినిధులు అభినందించారు.ఈనాటి కార్యక్రమంలో కళావేదిక ప్రతినిధులు బైరోజు చంద్ర శేఖర్, బండారు శ్రీనివాస్,దేశి రాములు యాదవ్,గంధం నాగరాజు,గోపాలదిన్నె రాంరెడ్డి,పావనం చంద్ర శేఖర్,శివశంకర్,నరసింహారావు,మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top