రావినారాయణ రెడ్డి పోరాటం గొప్ప స్ఫూర్తి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .
తెలంగాణా సాయుధ పోరాట వీరుడు పద్మవిభూషణ్ రావినారాయణ రెడ్డి స్మారక జాతీయ అవార్డును నేడు జస్టిస్ సుదర్శన్ కి సిఎం రేవంత్ రెడ్డి ప్రదానం చెయ్యడం జరిగింది.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భూస్వామ్య కుటుంబంలో పుట్టి తనకు
వారసత్వంగా వచ్చిన 500 ఎకరాలను పేద ప్రజలకు పంచిన గొప్ప వ్యక్తని,దేశంలోనే అత్యధిక ఓట్లు సాధించి ఈ దేశ పార్లమెంట్ ను ప్రారంభించిన చరిత్ర రావినారాయణ రెడ్డి కే దక్కిందని అన్నారు. యువకులకు రాజకీయ నాయకత్వం ఇవ్వాలని 60 సంవత్సరాలకె రాజకీయాల నుండి తప్పుకొని నిస్వార్ధ జీవితం గడిపారని అన్నారు.ప్రపంచంలో నే తెలంగాణా సాయుధ పోరాటం గొప్ప చరిత్ర కలదని అన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
