తన పిల్లల పేర్లు వెల్లడించిన రామ్‌చరణ్
ప్రముఖ నటుడు రామ్‌చరణ్ తన కవల పిల్లల పేర్లను వెల్లడించారు. అబ్బాయి పేరు శివరామ్ అని, అమ్మాయి పేరు అన్విరా దేవి అని తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో రామ్‌చరణ్ ఈ విషయాన్ని పంచుకున్నారు. జనవరి 31న ఉపాసన-రామ్‌చరణ్ దంపతులకు కవలలు జన్మించిన విషయం తెలిసిందే. దీంతో చిరంజీవి ఇంట ఆనందం వెల్లివిరిసింది. అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెప్పారు.

