సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ

Sakshitha news

సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి, ఘనమైన విజయాన్ని అందించిన ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీ అభ్యర్థుల విజయం కోసం అహర్నిశలు శ్రమించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు పేరు పేరునా కృతజ్ఞతలు. నేను ఇచ్చిన హామీ మేరకు సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల అభివృద్ధికి కట్టుబడి వున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా మంత్రి దామోదర్ నరసింహ, జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి సహకారంతో ఈ రెండు మున్సిపాలిటీలను సమగ్రంగా అభివృద్ధి చేస్తాను. ఇంతటి విజయాన్ని అందించిన ఈ రెండు మున్సిపాలిటీల ప్రజలకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఇట్లు
నిర్మల,జగ్గారెడ్డి

Scroll to Top