ఆర్ముడ్ పోలీస్ అధికారులు, సిబ్బంది నివాస భవనాల నిర్మాణ పనులను పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఘా…
సాక్షిత పెద్దపల్లి : రామగుండం పోలీస్ కమిషనరేట్ సాయుధ బలగాల అధికారుల, సిబ్బంది క్వార్టర్స్ నూతన భవనాల నిర్మాణ పనులు పూర్తై ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో, సీపీ అధికారులతో కలిసి పనులను పరిశీలించారు.
పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలని, ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. అవసరమైన అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తిచేసి, ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సీపీ వెంట పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ రావు ,ఆర్ ఐ లు శేఖర్, రమేష్ ఉన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY