రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మనాలి రాజ్ ఠాకూర్ దంపతుల పెళ్లి రోజు

Sakshitha news

రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మనాలి రాజ్ ఠాకూర్ దంపతుల పెళ్లి రోజు సందర్బంగా ప్రత్యేక పూజలు…

సాక్షిత పెద్దపల్లి//అంతర్గాం: రామగుండం శాసనసభ్యులు మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్- మనాలి రాజ్ ఠాకూర్ ల వివాహ వార్షికోత్సవ సందర్భంగా అంతర్గాం మండల కేంద్రంలోని టిటియస్ అంతర్గాంలొ స్వయంభు వెలసిన శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మనాలి రాజ్ ఠాకూర్ దంపతుల పేరూన ప్రత్యేక పూజ కార్యక్రమం, అర్చన కార్యక్రమం వేద పండితుల సమక్షంలో నిర్వహించడం జరిగినది.

అంతర్గాం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంతర్గాం మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మండల ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ గ్రామాల అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రామగుండం అభివృద్ధి కొరకే అనునిత్యం శ్రమిస్తున్న ఆదర్శ దంపతులైన రాజ్ ఠాకూర్- మనాలి రాజ్ ఠాకూర్ లకు నూకాంబిక అమ్మవారు ఆశీస్సులను అందించి, వారు నడుస్తున్న అభివృద్ధి బాటలో మరిన్ని విజయాలు చేకూర్చే విధంగా ఆ పుణ్య దంపతులను ఆశీర్వదించి, రామగుండం నియోజకవర్గాన్ని నవనిర్మాణ రామగుండంలో వారికి వెన్నుదన్నుగా అమ్మవారు నిలిచి, రాబోయే కాలంలో వారు ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఈ ప్రాంతంలోని ప్రజలకు యువకులకు అనేకమైన అవకాశాలు కల్పించే విధంగా ముందుకు సాగాలని, ఈ ప్రాంతంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు.

రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కొరకు అనేకమైన నిధులను తీసుకువచ్చి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ, ముందుకు నడుస్తున్న రాజ్ ఠాకూర్ దంపతులు, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా నూకాంబిక అమ్మవారి దయవల్ల మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ,ప్రజల మన్ననలు పొందే విధంగా అమ్మవారు ఈ కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరారు, అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు.

Scroll to Top