కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి రాజీవ్ గాంధి నగర్ శ్రీ సాయి బాబా ఆలయ 9వ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ * మరియు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిలుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా, సమృద్ధిగా ఉండాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో నిజాంపేట్ సర్కిల్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, కొలన్ జీవన్ రెడ్డి, సాయి రాజ్, ఏరోళ్ల విష్ణు, ఆలేటి శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గడ్డం రాజేందర్ రెడ్డి, సిద్దనోళ్ల సంజీవ్ రెడ్డి, మైసిగారి శ్రీనివాస్, బాల బ్రహ్మ చారీ, శ్రీనివాస్, సుజాత యాదవ్, జ్యోతి తో పాటు పలువురు నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

