మంత్రి నారా లోకేష్ కి ఘన స్వాగతం పలికిన- రామ మల్లిక్ నాయుడు
విశాఖపట్నం,
రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖ విమానాశ్రయానికి చేరుకోగా, కిమిడి రామ మల్లిక్ నాయుడు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయనకు ఘన స్వాగతం పలికారు.
మంత్రి లోకేష్ ఈ సందర్భంగా ప్రజలు, కార్యకర్తలను కలిసి వారి నుంచి అర్జీలు స్వీకరించారు.అనంతరం, మంత్రి లోకేష్ విశాఖ నుంచి రోడ్డుమార్గంలో పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం భామిని గ్రామానికి పయనమయ్యారు.
కిమిడి రామ మల్లిక్ నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు ఆశయాలకు అనుగుణంగా, నియోజకవర్గ పరిధిలో అభివృద్ధిని వేగవంతం చేయడానికి మా ప్రయత్నం నిరంతరం కొనసాగుతుందన్నారు.
మంత్రి నారా లోకేష్ ఉత్తరాంధ్ర పర్యటనకు రావడం పార్టీకి, యువతకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. పార్టీ బలోపేతం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేను ఎల్లప్పుడూ కృషి చేస్తాను” అని తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
