టీటీడీలో పదోన్నతులు కల్పించాలి
** రూల్ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలి
** ఈఓకు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వినతి
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: తిరుమల – తిరుపతి దేవస్థానంలోని ఎస్సీ – ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘానికి గ్రీవెన్స్ మీటింగుకు పెద్ద మనసుతో సమయం కేటాయించిన ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు టీటీడీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కోణాపురం ఆంజనేయులు తెలిపారు. సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ను కలసి సుధీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్బంగా ఆంజనేయులు ఈఓ దృష్టికి కొన్ని అంశాలను తీసుకెళ్లారు. వాటిలో….గత ఐదు సంవత్సరాలుగా టీటీడీలో పదోన్నతులు ఇవ్వడం లేదని… పదోన్నతులలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. ఎన్నో సంవత్సరాల ఫలితంగా వర్గీకరణ అమలు చేయాలని విన్నవించారు. ఈ తరుణంలో పదోన్నతులలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అన్నీ అమలయ్యేలా చూస్తామని ఈఓ అధికారులకు అదేశాలు ఇస్తూ సానుకూలంగా స్పందించారు.
ఎంప్లాయిస్ హెల్త్ ఫండ్ (ఈహెచ్ఎఫ్)ను 3 లక్షలు పరిమితి దాటిన దరఖాస్తులు సుమారుగా 420 పైగా పెండింగ్ లో ఉన్నవి. దాంతో ఉద్యోగస్తులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే టీటీడీకి చెందిన “స్విమ్స్” ఆస్పత్రిలో ఈహెచ్ఎఫ్ తో సంబంధం లేకుండా, 3లక్షలు పరిమితి లేకుండా ఉద్యోగులకు వైద్యం అందించాలని ఈఓకు మనవి చేశారు. దీనిపై త్వరలోనే అన్ని టీటీడీ ఉద్యోగ సంఘాల వారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఈఓ చెప్పారు. కోవిడ్ ముందు ఉద్యోగులు రిటైర్డ్ అయితే రిటైర్మెంట్ హాల్లొ ఘనంగా అందరి ఉద్యోగుల సమక్షంలో రిటైర్మెంట్ ఫంక్షన్ నిర్వహించడం జరిగేది కానీ… కోవిడ్ తరువాత ఇలా చేయడం లేదని ఈఓ దృష్టికి తీసుకెళ్లగా…. ఒకనెలలో పరిష్కరిస్తామని తెలిపారు. ఇంతకుముందు లాగా ప్రతి మూడు నెలలకొకసారి ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్సెస్ మీటింగ్ నిర్వహించాలని అడిగారు.
అందుకు సరే అని చెప్తూ, గ్రీవెన్సెస్ మీటింగ్ వరకు ఎదురు చూసేలా కాకుండా ఏ సమస్యనయినా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరిష్కరిస్తామని ఈఓ ఉద్యోగులకు స్పష్టం చేశారు. ఉద్యోగుల సంక్షేమం కోసం శ్రమిస్తున్న ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, వెల్ఫేర్ డెప్యూటీ ఈఓ ఆనంద రాజులకు ధన్యవాదములు తెలిపారు. ఈ సమావేశంలో టీటీడీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కోణాపురం ఆంజనేయులు, సీనియర్ నాయకులు ఆర్.రవి కుమార్, డాక్టర్ శకుంతల, ధనశేఖర్, కుమార్, ఎం.గజేంద్ర పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
