ప్రైవేట్ పాఠశాలలు జర్నలిస్టుల పిల్లల చదువు కోసం ఫీజులో 50% రాయితీ ఇవ్వాలి: టిడబ్ల్యూజేఎఫ్

Sakshitha news

ప్రైవేట్ పాఠశాలలు జర్నలిస్టుల పిల్లల చదువు కోసం ఫీజులో 50% రాయితీ ఇవ్వాలి: టిడబ్ల్యూజేఎఫ్


కుత్బుల్లాపూర్ : ప్రైవేట్ పాఠశాలలు జర్నలిస్టుల పిల్లల చదువు కోసం ఫీజులో 50% రాయితీ ఇవ్వాలని టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. మేడ్చల్-మల్కాజిగిరి
ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో మాయొక్క జర్నలిస్టుల పిల్లలకు 2026-27 సంవత్సరాలకు ఫీజుల్లో 50% రాయితీ జిల్లా విద్యాధికారి (DEO) వినతిపత్రం అందజేశారు. టిడబ్ల్యూజేఎఫ్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి గడ్డమీది అశోక్, నేషనల్ కౌన్సిల్ సభ్యులు దామర జగదీశ్వర్ గుప్తా, ఏ గోవిందరావు లు మాట్లాడుతూ…. మేడ్చల్ జిల్లాలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేస్తున్న జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని జర్నలిస్టుల పిల్లలకు ప్రతి విద్యా సంవత్సరం మాదిరిగా ప్రైవేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ కల్పిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రస్తుతం మన జిల్లాలో అనేక మంది జర్నలిస్టులు చాలీచాలని వేతనాలతో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 80 శాతం జర్నలిస్టులు వేతనాలు లేక నెలవారీ ఆదాయం లేక తమ పిల్లలను చదివించుకోలేక, కుటుంబాలను పోషించుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలకు ఫీజులు కట్టలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల పిల్లలకు 2026-27 విద్యా సంవత్సరాల్లో ప్రతి ప్రైవేట్ పాఠశాలలో 50% ఫీజు రాయితీ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల కుటుంబాల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక రాయితీ అమలు చేయాలని సూచించారు చేస్తున్నాం. రాబోయే 2026-27 విద్యా సంవత్సరం ఆరంభం అయ్యేనాటికి జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ అమలయ్యే విధంగా జీవో/సర్క్యులర్ జారీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూ జేఎఫ్ నాయకులు శివకుమార్, వీరేష్ ముదిరాజ్, సంజీవ్ కుమార్, శ్యాం ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top