ప్రతిష్టాత్మకంగా మహానాడు
తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నెల్లూరుకు రావడం అదృష్టంగా భావిస్తున్నాం
కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు
వేమిరెడ్డి దంపతులు
నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తున్న మహానాడు ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నామని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. కొడవలూరు మండలం ఇఫ్కో కిసాన్ సెజ్ లో జరుగుతున్న ఏర్పాట్లను వేమిరెడ్డి దంపతులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. మహానాడు ను నెల్లూరులో నిర్వహించడం అదృష్టంగాభావిస్తున్నామన్నారు.రాష్ట్రవ్యాప్తంగాతెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు జిల్లాకు రావడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. మహానాడు నిర్వహణ ఏర్పాట్ల విషయంలో ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
పార్టీ నియమించిన వివిధ కమిటీల తో సమన్వయం చేసుకుంటూ జిల్లాలో నిర్వహించే మహానాడు ను చారిత్రాత్మకంగా నిలిచిపోయేలా సన్నాహాలు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ లసూచన మేరకు మహానాడు ను విజయవంతం చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మంతెన సత్యనారాయణ రాజు జోనల్ కోఆర్డినేటర్ ముఖ్యమంత్రి టూర్ కోఆర్డినేటర్, బి.వి వెంకట రాముడు రాష్ట్ర మీడియా సమన్వయకర్త రాష్ట్ర కార్యదర్శి, రూప్ కుమార్ యాదవ్ నెల్లూరు డిప్యూటీ మేయర్, మావిడాల మధు తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర అధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
