పేదరికం నుంచి 25 కోట్ల మందికి విముక్తి: రాష్ట్రపతి

Sakshitha news

పేదరికం నుంచి 25 కోట్ల మందికి విముక్తి: రాష్ట్రపతి

  • దిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. ‘‘వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. స్వేచ్ఛ, సామాజిక న్యాయం అందరికీ అందాలని అంబేడ్కర్‌ ఆకాక్షించారు. పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తి కల్పించాం. 100 కోట్లకుపైగా గ్యాస్‌ కనెక్షన్లు అందించాం. ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా కోట్ల మందికి వైద్య సేవలు అందిస్తున్నాం’’ అని రాష్ట్రపతి అన్నారు.