పార్టీ కోసం ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధం.
బిజెపి పార్టీ జలగరి అశోక్.
సాక్షిత :జోగులాంబ గద్వాల.
అలంపూర్ తాలూకా ఐజ పట్టణానికి చెందిన జలగరి అశోక్, బీజేపీ పార్టీ ఆదేశానుసారం మేడ్చల్ నియోజకవర్గం లో పనిచేస్తున్నారు.
మేడ్చల్ నియోజకవర్గం ఎల్లంపేట మున్సిపాలిటీ లో నామినేషన్ సందర్భంగా ర్యాలీలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల్ రాజేంద్ర తో పాటు మున్సిపాలిటీ ఎలక్షన్ సహ ఇంచార్జ్ జలగరి అశోక్ పాల్గొన్నారు.
జలగరి అశోక్
జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు.
అలంపూర్ తాలూకా ఐజ మండలంలో బిజెపి పార్టీ బలోపేతానికి గత 30 సంవత్సరాలగా విశేషంగా కృషి చేసినారు.
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలలో భాగంగా పార్టీ ఆదేశా ఆదేశానుసారం, వివిధ ప్రాంతాల్లో తన విధులను నిర్వర్తిస్తున్నారు. జలగల అశోక్ మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం దేశం కోసం పనిచేస్తుందని, పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా సేవలందించడం, చాలా గొప్ప విషయమని తనలాంటి వ్యక్తికి బిజెపి పార్టీ అవకాశం కల్పించిందని అందుకు, అందుకు బిజెపి పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
